Nagarjuna : స‌మంత బాట‌లో న‌డ‌వ‌నున్న నాగార్జున‌..? ఆ విధంగా చేస్తారా..?

January 28, 2022 4:12 PM

Nagarjuna : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత‌కు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. స‌మంత చెప్పినా విన‌డం లేద‌ని, బోల్డ్ సీన్ల‌లో న‌టించేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంద‌ని, అస‌లు ఆమెకు పిల్ల‌ల్ని క‌న‌డం ఇష్టం లేద‌ని, అందువ‌ల్ల అబార్ష‌న్ కూడా చేయించుకుంద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. వాట‌న్నింటిపై స‌మంత కోర్టు వ‌ర‌కు వెళ్లింది.

Nagarjuna may proceed to take legal action against those who created false news

కోర్టు అలాంటి వార్త‌ల‌ను ప్ర‌సారం చేసిన యూట్యూబ్ చాన‌ల్స్‌కు మొట్టికాయ‌లు వేసింది. దీంతో క్ష‌మాప‌ణ‌ల‌తో స‌రిపెట్టారు. అప్ప‌ట్లో ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. అయితే తాజాగా నాగార్జున కూడా స‌మంత బాట‌లో న‌డ‌వాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు కార‌ణం కూడా ఉంది.

ఇటీవ‌ల తాను ఎక్క‌డా మాట్లాడ‌కున్నా.. చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్‌సైట్లు, చాన‌ల్స్‌లో త‌న మాట‌లుగా కొన్ని వార్త‌ల‌ను ప్ర‌చురించారు. స‌మంత‌నే ముందుగా విడాకులు కావాల‌ని అడిగింద‌ని, అందుకు చైత‌న్య ఒప్పుకున్నాడ‌ని.. నాగార్జున చెప్పాడ‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ మాట‌ల‌ను తాను అన‌లేద‌ని నాగార్జున త‌రువాత క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ వార్త‌ల‌పై నాగార్జున సీరియ‌స్ అయ్యార‌ని తెలుస్తోంది.

అస‌లు ఈ వార్త‌ల‌ను మొద‌ట ఎవ‌రు సృష్టించారో తెలుసుకోవాల‌ని నాగార్జున త‌న టెక్నిక‌ల్ టీమ్‌కు పుర‌మాయించార‌ట‌. ఈ వార్త‌ల‌ను ముందుగా ఎవ‌రు సృష్టించారు, ఎవ‌రు ప్ర‌చురించారు.. అనే విష‌యాల‌ను తెలుసుకుని వారిపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అప్ప‌ట్లో స‌మంత కూడా ఇలాగే చేసినందున‌.. నాగార్జున కూడా అదేవిధంగా ముందుకు సాగాల‌ని చూస్తున్నార‌ట‌.

అయితే త‌ప్పుడు వార్త‌లు అనుకుంటే.. చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థ‌లు ఆ వార్త‌ల‌ను ప్ర‌చురించాయి క‌నుక అంద‌రిపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం కుద‌ర‌దు. అవి పుకారు వార్త‌ల కింద‌కు వ‌స్తాయి. కానీ కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని ఎవ‌రైనా సృష్టించి ఉంటే.. వారి గురించి తెలిస్తే.. అప్పుడు వారిపై లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ వార్త‌ల‌ను క్రియేట్ చేసిన వారిని గుర్తిస్తారా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment