Good Luck Sakhi Movie Review : కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ..!

January 28, 2022 11:14 AM

Good Luck Sakhi Movie Review : మ‌హాన‌టి సినిమా కీర్తి సురేష్‌కు ఎంత‌టి పేరు తెచ్చి పెట్టిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మూవీ త‌రువాత వ‌చ్చిన సినిమాలు పెద్ద‌గా హిట్ అవ‌లేదు. దీంతో కీర్తి సురేష్ లేడీ ఓరియెంట్ సినిమాల‌ను ఎక్కువ‌గా చేస్తోంది. ఇక ఇటీవ‌ల ఆమె న‌టించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆడ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆమె లీడ్ రోల్‌లో తాజాగా గుడ్ ల‌క్ స‌ఖి అనే మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో కీర్తి సురేష్‌తోపాటు ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ వంటి న‌టులు కీల‌క‌పాత్ర‌ల‌ను పోషించారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

Good Luck Sakhi Movie Review keerthy suresh jagapathi babu

క‌థ‌..

జ‌గ‌ప‌తి బాబు గుడ్ ల‌క్ స‌ఖి మూవీలో మాజీ క‌ల్న‌ల్ పాత్ర‌ను పోషించారు. ఆయ‌న త‌న గ్రామంలో ఉన్న ప్ర‌తిభావంతుల‌ను గుర్తించి జాతీయ స్థాయిలో వారు రాణించాల‌ని, వారిని చాంపియ‌న్‌లుగా నిల‌బెట్టాల‌ని ఆశిస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే స‌ఖి (కీర్తి సురేష్‌)ని అంద‌రూ దుర‌దృష్టానికి సింబ‌ల్‌గా భావిస్తుంటారు. అయితే దుర‌దృష్టానికి మారుపేరు అయిన‌ప్ప‌టికీ ఆమె షూటింగ్‌లో చాంపియ‌న్ అవ‌డం ద్వారా ఊరికి మంచి పేరు ఎలా తీసుకువ‌చ్చింది ? అన్న‌దే క‌థ‌. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు న‌గేష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఇందులో గోలిరాజు అకా రామారావు పాత్ర‌లో ఆది పినిశెట్టి న‌టించాడు. సూరి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ క‌నిపించాడు. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతుంది.

కీర్తిసురేష్ చేసిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తెర‌కెక్కించింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఇందులో జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టిలు త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర బాగానే న‌టించారు. ఇక లీడ్ రోల్‌లో కీర్తి సురేష్ మ‌రోమారు త‌న మ్యాజిక్‌ను ప్ర‌ద‌ర్శించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

అయితే స్పోర్ట్స్ డ్రామా మూవీ అయిన‌ప్ప‌టికీ, ఎంచుకున్న క‌థాంశం బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంలో కొన్ని చోట్ల విఫ‌లమైన‌ట్లు తెలుస్తుంది. అయిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా చూస్తే గుడ్ లక్ సఖి మూవీ పూర్తి భిన్న క‌థాంశ చిత్రంగా నిలుస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అంద‌రూ క‌లిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now