Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ వీడియో లీక్‌.. మ‌రింత భారీగా పెరిగిన అంచ‌నాలు..!

January 27, 2022 12:47 PM

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కావ‌ల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఉన్న నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ప‌వ‌న్‌ను ఒప్పించారు. దీంతో ఆయ‌న త‌న మూవీని వాయిదా వేసుకున్నారు. అయితే క‌రోనా వ‌ల్ల ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల వాయిదా ప‌డింది. దీంతో భీమ్లా నాయ‌క్‌పై అంద‌రి క‌న్ను ప‌డింది. అయిన‌ప్ప‌టికీ సంక్రాంతికి ఈ మూవీ విడుద‌ల కాలేదు. ఇక ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Bhimla Nayak video leaked online hype increased very much

అయితే తాజాగా భీమ్లా నాయ‌క్ నుంచి ఓ వీడియో లీకైంది. సామాజిక మాధ్య‌మాల్లో ఆ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ పోలీస్ స్టేష‌న్ సీన్ ఉంది. అందులో ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతుండడం విశేషం. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాపై మ‌రింత‌గా అంచనాలు పెరిగిపోయాయి.

భీమ్లా నాయ‌క్ చిత్రం రీమేక్ అయిన‌ప్ప‌టికీ దీన్ని తెలుగుద‌నానికి ద‌గ్గ‌ర‌గా ఉండే విధంగా తెర‌కెక్కించారు. రానా ఇందులో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం మ‌రో ప్ల‌స్ పాయింట్‌గా మారింది. దీంతో అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

చాలా రోజుల త‌రువాత ప‌వ‌న్ మ‌ళ్లీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుండ‌డం అభిమానుల‌కు ఎంత‌గానో ఆనందాన్నిస్తోంది. అయితే ఫిబ్ర‌వ‌రి 25వ తేదీ వ‌ర‌కు ప‌రిస్థితులు చక్క‌బ‌డి క‌రోనా అదుపులోకి వ‌స్తుందా.. చిత్రం విడుద‌ల‌వుతుందా..? అనే అంద‌రిలోనూ సందేహాలు నెల‌కొన్నాయి. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now