Jabardasth Varsha : జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష ఇంట్లో విషాదం.. సోష‌ల్ మీడియాలో భావోద్వేగంతో పోస్టు..

January 25, 2022 3:28 PM

Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్షకుల‌కు జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె గ‌తంలో మోడ‌ల్‌గా రాణించింది. అయిన‌ప్ప‌టికీ జ‌బ‌ర్ద‌స్త్ షోకు వ‌చ్చాకే ఈమెకు మ‌రింత పాపులారిటీ పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ లో లేడీ క‌మెడియ‌న్‌గా రాణిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఈమె ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

Jabardasth Varsha brother got accident and getting treatment

హీరోయిన్లలాగానే జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష కూడా అప్పుడ‌ప్పుడు గ్లామర్ షో చేస్తుంటుంది. మ‌తులు పోగొట్టే ఫోటోల‌ను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈమె ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. వ‌ర్ష సోద‌రుడు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఈ క్ర‌మంలోనే అత‌ని ప‌రిస్థితి గురించి వ‌ర్ష పోస్ట్ పెట్టింది.

ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు కోలుకున్నాడ‌ని వ‌ర్ష సోష‌ల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. త‌న సోద‌రుడు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నాడ‌ని చెబుతూ ఆ ఫొటోను కూడా జత చేసింది. ఈ సంద‌ర్భంగా వ‌ర్ష ఎమోష‌న‌ల్ అయింది. సంక్రాంతి వేడుక‌ల్లో సంతోషంగా ఉన్న త‌మ కుటుంబానికి ఈ ప్ర‌మాదం వార్త పెద్ద షాక్‌ను ఇచ్చింద‌ని ఆమె తెలియ‌జేసింది. కాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్ష ఈ సంద‌ర్భంగా అంద‌రికీ ఒక రిక్వెస్ట్ చేసింది.

దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ముగ్గురు వ్యక్తులు ట్రిపుల్ రైడింగ్‌తో నిర్లక్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల్లే నా సోద‌రుడికి ప్ర‌మాదం జ‌రిగింది. హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. మా ఫ్యామిలీ అంతా బాధపడ్డాం. ఎవరైనా సరే డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఎవరూ ఏ ఫ్యామిలీలోనూ బాధపడాల్సిన అవ‌స‌రం రావొద్దు.. అని పోస్ట్ పెట్టింది వ‌ర్ష‌. కాగా వ‌ర్ష పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment