Ileana : ప్యాంట్స్‌ను త్యాగం చేసిన ఇలియానా..?

January 24, 2022 10:29 PM

Ileana : గోవా బ్యూటీ ఇలియానా ల‌వ్ బ్రేక్ అప్ అయ్యాక చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉంది. ఆ త‌రువాత ర‌వితేజ స‌ర‌స‌న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అనే చిత్రంలో న‌టించినా.. ఈమె బాగా లావుగా అవ‌డం, సినిమా ఫ్లాప్ అవ‌డంతో.. ఈమెకు మళ్లీ అవ‌కాశాలు రాలేదు.

Ileana said all is about pants

అయితే ఇలియానా ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె గ్లామ‌ర్ డోస్‌ను మ‌రింత పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు.

ఇలియానా ఈ మ‌ధ్య ఎక్కువ‌గా బీచ్‌లో సంద‌డి చేస్తున్న ఫొటోల‌ను షేర్ చేస్తోంది. ఇక తాజాగా మ‌రో ఫొటోను షేర్ చేస్తూ ఓ క్యాప్ష‌న్ ను పెట్టింది. తాను ప్యాంట్స్‌ను త్యాగం చేస్తున్న‌ట్లు అర్థం వ‌చ్చేలా పోస్ట్ పెట్టింది. అంటే.. ఈమె ఇక‌పై ఎల్ల‌ప్పుడూ మ‌న‌కు బికినీలోనే క‌నిపిస్తుందా ? అని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు.

అయితే pants అనే ప‌దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒక‌టి వేసుకునే ప్యాంట్స్‌. ఇంకొక‌టి.. వేగంగా శ్వాస తీసుకోవ‌డం అని అర్థాలు వ‌స్తాయి. అయితే ఇలియానా పెట్టిన క్యాప్ష‌న్‌ను బ‌ట్టి చూస్తే pants ప‌దానికి మ‌నం రెండో అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. తాను వేగంగా శ్వాస తీసుకుంటూనే జీవితాన్ని గ‌డ‌ప‌బోతుంద‌ని అర్థం వ‌స్తుంది.

ఈమె బ్రేక‌ప్‌తో బాగా అప్ సెట్ అయింద‌ని, అందుక‌నే ఇలాంటి క్యాప్ష‌న్ పెట్టింద‌ని ప‌లువురు అంటున్నారు. ఏది ఏమైనా.. ఇల్లీ బేబీ మాత్రం త‌న బికినీ ట్రీట్ ను ఆప‌డం లేదు. వ‌రుస ఫొటోల‌తో మ‌తులు పోగొడుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now