Naga Chaithanya : ఆ విష‌యం న‌న్ను ఎక్కువ ఇబ్బందుల‌కు గురి చేస్తుంది: నాగ‌చైత‌న్య

January 22, 2022 12:14 PM

Naga Chaithanya : విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన త‌రువాత అటు నాగ‌చైత‌న్య‌, ఇటు స‌మంత ఎవ‌రి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు. అయితే విడిపోయాక కూడా స్నేహితుల్లా క‌ల‌సి ఉంటామ‌న్న ఈ జంట మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం విశేషం. ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు బెస్టాఫ్ ల‌క్ చెప్పుకోవ‌డం లేదు, ఒక‌రి బ‌ర్త్‌డేకు ఒక‌రు విషెస్ చెప్పుకోవ‌డం లేదు. ఇది అటుంచితే.. తాజాగా నాగ‌చైత‌న్య చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Naga Chaithanya said that thing bothers him most

ఓ బాలీవుడ్ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగ‌చైత‌న్య మాట్లాడుతూ.. త‌న విడాకుల విష‌యంపై తాను ఎక్కువ‌గా మాట్లాడాల‌నుకోవ‌డం లేద‌ని.. ఎందుకంటే అది త‌న కుటుంబంపై నెగెటివ్ ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌న్నాడు. ప్ర‌స్తుతం త‌న‌కు త‌న ఫ్యామిలీ చాలా ముఖ్య‌మ‌ని అన్నాడు.

తాను ఏదైనా కామెంట్ చేస్తే త‌న కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతార‌ని.. అది త‌న‌కు న‌చ్చ‌ద‌ని.. పండ్లు ఉండే చెట్టుకే రాళ్లు వేస్తారు క‌దా.. అని చైత‌న్య అన్నాడు. త‌న కుటుంబం గురించి ఎవ‌రైనా ఏదైనా మాట్లాడితే అది త‌న‌ను ఎక్కువ ఇబ్బందులకు గురిచేస్తుందని, క‌న‌క త‌న విడాకుల విష‌యంలో ఇక‌పై మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని తెలిపాడు.

కాగా నాగ‌చైత‌న్య న‌టించిన బంగార్రాజు చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి టాక్‌ను సొంతం చేసుకోగా.. త్వ‌ర‌లో చైతూ లాల్ సింగ్ చ‌డ్డా అనే బాలీవుడ్ మూవీలో కనిపించ‌నున్నాడు. ఇందులో అమీర్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now