Kubera Pooja : సిరి సంప‌ద‌ల‌కు అధిప‌తి అయిన కుబేరున్ని ఇలా పూజించండి.. ధ‌నం ల‌భిస్తుంది..!

January 16, 2022 9:38 AM

Kubera Pooja : ల‌క్ష్మీదేవిని పూజించ‌డం వ‌ల్ల ఆమె అనుగ్ర‌హించి ధ‌నాన్ని అందిస్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ధ‌నం కోసం కుబేరుడిని కూడా పూజించ‌వ‌చ్చు. కుబేరుడు ధ‌నానికి అధిప‌తి. ఆయ‌న సిరిసంప‌ద‌ల‌కు, న‌వ నిధుల‌కు అధిప‌తి. ఉత్త‌ర దిక్పాల‌కుడు. క‌నుక కుబేరున్ని పూజించినా కూడా సిరి సంప‌ద‌ల‌ను అనుగ్ర‌హిస్తాడు.

do Kubera Pooja in this way to please him and get rid of money problems

ఇక కుబేరుడు ఉత్త‌ర దిక్పాల‌కుడు క‌నుక ఆయ‌నకు పూజ చేయాలంటే మీ పూజ గ‌దిలో ఉత్త‌రం దిక్కున కూర్చోవాలి. అనంత‌రం చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రని వస్త్రాన్ని పరచాలి. కలశాన్ని ఉంచాలి. నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఆ కలశాన్ని పూజించాలి. త‌రువాత‌ కుబేరుని యంత్రాన్ని ఉంచి పంచామృతంతో అభిషేకం చేయాలి. కుబేరుని యంత్రం, ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచాలి.

కుబేరుడికి ధాన్యం, బెల్లం అర్పించాలి. ఇంట్లో ఉన్న బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి ఆ త‌రువాత పూజ ప్రారంభించాలి. పూజ‌లో భాగంగా 5 సార్లు.. ఓం గం గణపతయే నమః అని జపించాలి. అలాగే ఓం శ్రీ కుబేరాయ నమః , ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసి మాలతో 108 సార్లు జపించాలి.

పూజ‌లో కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించాలి. పూజ గ‌దిలో స్వస్తిక్ గుర్తును ఉంచాలి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేస్తే మంచిద‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment