Samantha : వాట్‌.. అప్పుడు స‌మంత గ‌ర్భ‌వ‌తా..?

January 12, 2022 11:48 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంతపై వ‌స్తున్న విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. ఓ ద‌శ‌లో తాను తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యాన‌ని స‌మంత ఇటీవ‌లే చెప్పింది. అయితే ఆ బాధ నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆమె ఎక్కువ‌గా టూర్లు వేస్తోంది. దీంతోపాటు త‌న‌కు దొరికిన ప్ర‌తి సినిమా అవ‌కాశాన్ని మిస్ చేసుకోవ‌డం లేదు.

does Samantha pregnant at that time what she said

అయితే స‌మంత ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ఇంట‌రాక్ష‌న్ నిర్వ‌హించ‌గా.. అందులో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. 2017లో మీరు ప్రెగ్నెంటా ? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె బ‌దులిస్తూ.. అవును.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నేను గ‌ర్భ‌వ‌తినే.. అని వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చింది.

ఇక చైతూ గురించి వేయించుకున్న టాటూలుపై కూడా ఆమె స్పందించింది. అవి ఇద్ద‌ర‌మూ వేయించుకున్నామ‌ని, అవి త‌మ‌కు చాలా స్పెష‌ల్ అని చెప్పింది. అయితే స‌మంత ఇటీవ‌లి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ‌గా సందేశాల‌ను షేర్ చేస్తూ ఉన్న‌ప్ప‌టికీ తొలిసారిగా ఇలా స్పందించ‌డం ఆమెకు ఎంతో రిలీఫ్ ఇచ్చింద‌ని అంటున్నారు.

సినిమాల ప‌రంగా చూస్తే స‌మంత ఇటీవ‌లే పుష్ప సినిమాలో ప్ర‌త్యేక సాంగ్‌లో క‌నిపించి అల‌రించింది. త్వ‌ర‌లో ఈమె న‌టించిన కాతువాకుల రెండు కాదల్ అనే మూవీ విడుద‌ల కానుంది. అలాగే శాకుంత‌లం అనే మూవీ సైతం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment