Sonu Sood : మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్‌.. బాలికలు, మహిళలకు సైకిళ్ల పంపిణీ..

January 6, 2022 1:19 PM

Sonu Sood : కరోనా మొదటి వేవ్‌ సమయం నుంచి నటుడు సోనూసూద్‌ ఎంత మంది ఆదుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఆదుకోండి.. అంటూ తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన నేనున్నానంటూ సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోనూసూద్‌ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సొంత ఊళ్లో బాలికలు, మహిళలు, యువతులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

Sonu Sood distributed bicycles to girls and women

పంజాబ్‌లోని మోగాలో ఉన్న దౌలత్‌పురా నీవన్‌ అనే గ్రామంలో సోనూసూద్‌ సోదరి మాళవిక విద్యార్థినులు, ఆశ వర్కర్లకు 1000 సైకిళ్లను పంపిణీ చేశారు. ఆమె ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో చేరేది వెల్లడించలేదు. అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలను మాత్రం చేపడుతున్నారు. ఇక ఆమెకు మద్దతుగా సోనూసూద్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోనూసూద్‌ తన సోదరి మాళవికతో కలిసి ఇప్పటికే సూద్‌ చారిటీ ఫౌండేషన్‌ సేరిట స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మోగే ది ఢీ పేరిట విద్యార్థినిలు, ఆశ వర్కర్లకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.

అయితే పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వేడెక్కింది. ఇప్పటికే అనేక పార్టీలు తాము ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాయో చెప్పేశాయి. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ తాము అధికారంలోకి వస్తే ఒక్కో మహిళకు నెలకు రూ.2000 ఇస్తామని చెప్పగా.. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ఒక్కొక్కరికి రూ.1000 ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధు మహిళలకు నెల నెలా ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్లను, ఒక్కొక్కరికి రూ.2000తోపాటు గృహిణులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను, 5 నుంచి 12 తరగతులు చదువుతున్న బాలికలకు నెలకు రూ.5వేల నుంచి రూ.20వేలు ఇస్తామని చెప్పారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినిలకు ఉచితంగా లోన్లు కూడా ఇస్తామని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now