Shriya Saran : ఘాటు ముద్దు.. మైకంలో మునిగిపోయిన శ్రియ భ‌ర్త‌..!

December 31, 2021 2:39 PM

Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ శరన్‌.. పెళ్లి త‌ర్వాత చేసే ర‌చ్చ మాములుగా ఉండడం లేదు. త‌న భ‌ర్తతో క‌లిసి ఈ అమ్మ‌డు తెగ రెచ్చిపోతోంది. ప‌బ్లిక్‌గానే లిప్ లాక్‌లు, హ‌గ్గులు ఇలా ఒక‌టేంటి.. నానా ర‌చ్చ చేస్తోంది. 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని ఈమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Shriya Saran enjoying new year celebrations with her husband in Goa

న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా శ్రియ అండ్ ఫ్యామిలీ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డ చేసే సంద‌డికి సంబంధించి ప‌లు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ వ‌స్తోంది శ్రియ‌. ఈ అమ్మ‌డి గ్లామర్ ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ త‌న భ‌ర్త‌కి గాఢ చుంబ‌నం అందించింది. ఇది చూసి నెటిజ‌న్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రియ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రియ. అందంతో, అభినయంతో మెప్పించింది. ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా శ్రియ గమనం అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ చిత్రంలో శ్రియ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రియ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment