Samantha : వ‌ర్కౌట్ సీక్రెట్.. ఇష్ట‌మైన‌వి తిని అరిగించుకునేందుకే ఇవి.. అంటున్న స‌మంత‌..

డిసెంబర్ 31, 2021 12:59 సా.

Samantha : ఈ కాలం హీరోయిన్స్ స్లిమ్‌గా ఉండేందుకు నానా తంటాలూ ప‌డుతున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇక అందాల ముద్దుగుమ్మ స‌మంత త‌న ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స‌మంత సోష‌ల్ మీడియాలో సరదా పోస్ట్‌లు పెడుతూ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే వ్యాయామానికి సంబంధించిన పోస్ట్‌ పెట్టి నవ్వించింది.

Samantha says that she does lot of gym to eat samosas

తాను జిమ్ చేసిన వీడియోను షేర్‌ చేస్తూ ‘తినేందుకే ఈ వర్కౌట్‌’ అని రాసుకొచ్చింది. మ‌రి స‌మంత అంత‌గా ఏం తినాల‌నుకుంతో తెల‌సా ? త‌న‌కు ఇష్ట‌మైన స‌మోసా. తనకు సమోసాలు అంటే మహా ఇష్టమట, కానీ ఫిట్‌నెస్‌ దృష్ట్యా వాటిని తినలేకపోతోందట. అందుకనే సమోసాను ఎదురుగా పెట్టుకుని జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుందట సామ్‌.

తినాల‌నిపించిన‌ప్పుడు బాగా జిమ్ చేసి శ‌రీరంలోని క్యాల‌రీస్ క‌రిగాక స‌మోసాలు తింటుంద‌ట‌. మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలు, మన మనసు ఉంటుంద‌న్న‌ట్టు స‌మంత చెప్పుకొచ్చింది. ఏదేమైనా సమోసా కోసం స‌మంత ప‌డుతున్న క‌ష్టం చూసి అంద‌రూ అవాక్క‌వుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం యశోద, కాతువాకుల రెండు కాదల్‌ చిత్రాలతో బిజీగా ఉంది. వీటితోపాటు పలు భారీ ప్రాజెక్ట్స్‌కు కూడా ఆమె సంతకం చేసి ఫుల్‌ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment