Varun Sandesh : అత‌డి వ‌ల్ల త‌న భార్య న‌ర‌కం చూసింద‌న్న వ‌రుణ్ సందేశ్‌..!

December 27, 2021 2:28 PM

Varun Sandesh : హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన హీరో వ‌రుణ్ సందేశ్. చాలా రోజుల త‌ర్వాత అతను మ‌ళ్లీ ఓ సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నఇందువ‌ద‌న చిత్రంలో ఫర్నాజ్ శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తోంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది.

Varun Sandesh said that because of him his wife faced torture

జ‌న‌వ‌రి 1న సినిమాను విడుద‌ల చేసే ప్లాన్ చేస్తుండ‌గా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ స‌మయంలో వ‌రుణ్ సందేశ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. నా కోసం మా నాన్న ఎంతో కష్టపడ్డారు. నా జీవితంలో నాన్న నాకు ఒక గైడ్ అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. అలాగే త‌న ఫాదర్ వితికను సొంత కూతురిలా చూసుకుంటారని కూడా అతను తెలిపాడు. ఇకపోతే పడ్డానండి ప్రేమలో మరి.. సినిమా సమయంలో తాము ప్రేమలో పడ్డామని ,ఇక ఆ టైటిల్ కు తగ్గట్టుగానే తమ ప్రేమలో కూడా తాము పడ్డామని అతను వెల్లడించాడు.

ఇక ఈ ఇద్ద‌రూ బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక జ‌రిగిన ట్రోలింగ్ గురించి తెలియ‌జేశాడు. మెసేజ్‌లు చూసి వాళ్లను ఏమనాలో కూడా అర్థం కాలేదని వరుణ్ సందేశ్ తెలిపాడు. గంటసేపు షో చూసి అవతలి వ్యక్తుల క్యారెక్టర్ ను డిసైడ్ చేయకూడదని కూడా.. వరుణ్ సందేశ్ పేర్కొనడం గమనార్హం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. ఒక‌డి వ‌ల‌న తన భార్య నరకం చూసిందని కూడా వరుణ్ సందేశ్ వెల్లడించాడు. అత‌డు ఎవ‌ర‌నేది మాత్రం వ‌రుణ్ వెల్లడించలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now