Chiranjeevi : వ్య‌వ‌సాయం చేసిన చిరు.. ఏం పండించారో తెలుసా ?

December 24, 2021 10:05 AM

Chiranjeevi : జై జవాన్.. జై కిసాన్.. ఈ ఇద్దరూ లేకపోతే భారతదేశం లేదు అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. భారతీ మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 23న ‘నేషనల్ ఫార్మర్స్ డే‌’ను జరపుకోవడం మొదలుపెట్టాం. ఈ క్ర‌మంలో చిరంజీవి కూడా రైతుల గొప్ప‌దనాన్ని తెలియ‌జేస్తూ వారికి సెల్యూట్ చేశారు.

Chiranjeevi done farming know what he grown

చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ.. ప్రకృతి చాలా గొప్పదని, ఒక్క విత్తు నాటితే అది ఎంతో మందికి కడుపు నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలని పిలుపునిచ్చారు. తన ఇంటి పెరట్లో ఆనపకాయ (సొరకాయ) విత్తనం నాటితే అది, మొక్క మొలిచి తీగలా మారి కాయలు కాసిందని వెల్లడించారు.

https://twitter.com/TrendsChiru/status/1474028881866735616?s=20

తాను నాటిన విత్తు పెద్ద పాదులా మారి, రెండు కాయలు కాసిందని తెలిపారు. మీరు కూడా ఇంట్లో ఒక తొట్టిలోనైనా విత్తనం నాటండి… స్వయంగా పండించిన కూరగాయలతో వండిన వంట ఎంతో రుచికరంగా ఉంటుందని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. చిరంజీవి న‌టించిన ఆచార్య చిత్రం విడుదల‌కి సిద్ధంగా ఉండ‌గా, ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్‌ల‌తోపాటు బాబీ సినిమాతోను బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now