Shanmukh : విన్న‌ర్ క‌న్నా ఎక్కువే సంపాదించిన ష‌ణ్ముఖ్‌..!

December 21, 2021 4:42 PM

Shanmukh : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మం ఎట్ట‌కేల‌కు ముగిసింది. షోలో విజేత‌గా నిలిచిన స‌న్నీ ట్రోఫీతోపాటు విల్లా, అపాచీ బైక్, ప‌లు బ‌హుమ‌తులను అందుకున్నాడు. ఇక ర‌న్నరప్‌గా నిలిచిన ష‌ణ్ముఖ్ రెమ్యున‌రేష‌న్ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెబ్‌ సిరీస్‌లతో భారీగా అభిమానులను కూడగట్టుకున్న అతడు ఈ సీజన్‌ ట్రోఫీని ఈజీగా గెలిచేస్తాడని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. కానీ త‌ర్వాత సీన్‌ రివర్స్‌ అయింది.

Shanmukh reportedly got more than sunny

బిగ్‌బాస్‌ షో సగానికి వచ్చాక అప్పుడు ఆట మొదలెట్టాడు. మాటకు మాట సమాధానమిచ్చాడు. ఎదుటివారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు. సిరి, జెస్సీలే లోకంగా మోజ్‌ రూమ్‌లో ముచ్చట్లాడేవాడు. కాక‌పోతే సిరిని డామినేట్ చేస్తూ అత‌ను గేమ్ ఆడుతూ వ‌చ్చాడు. రాను రాను ష‌ణ్ముఖ్‌పై నెగెటివిటీ ఏర్ప‌డింది. చెత్త ప్లాన్లు వేస్తూ వచ్చిన షణ్ముఖ్‌ ఈ సీజన్‌ రన్నరప్‌గా నిలిచాడు.

బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో యాంకర్‌ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న‌ షణ్ను మొత్తంగా పదిహేను వారాలకు గాను రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. గెలుపు అంచుల దాకా వచ్చి టైటిల్‌ మిస్‌ అయిన ఈ బిగ్‌బాస్‌ బ్రహ్మ ఒక్క వారానికి అతడికి 4 నుంచి 5 లక్షల రూపాయలు అందుకున్నాడ‌ట‌. విన్న‌ర్ క‌న్నా ష‌ణ్ముఖ్ ఎక్కువ‌గా రాబ‌ట్టాడ‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment