Samantha : ఐట‌మ్ సాంగ్ చేసేందుకు స‌మంత అస‌లు ఒప్పుకోలేద‌ట‌.. కానీ ఆ కార‌ణంతో ఓకే చెప్పింది..!

December 19, 2021 2:32 PM

Samantha : అల్లు అర్జున్ తాజాగా న‌టించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌లైన ఈ మూవీకి రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించి మెప్పించింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ పుష్ప మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది.

Samantha not accepted item song first but said ok next

కాగా ఈ సినిమా స‌క్సెస్ మీట్‌ను తాజాగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఇందులో భాగంగా చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ మూవీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా స‌మంత స్పెష‌ల్ సాంగ్ గురించి ప‌లు విష‌యాల‌ను చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. స‌మంత‌ను స్పెష‌ల్ సాంగ్ చేయాల‌ని అడిగితే వెంట‌నే వ‌ద్ద‌ని చెప్పింద‌ని అన్నారు. తాను ఈ ఐట‌మ్ సాంగ్ చేయ‌లేన‌ని స‌మంత చెప్పింద‌ని, అయితే తాను ఆమెను క‌న్విన్స్ చేశాన‌ని తెలిపారు.

ఈ పాట మీకు బాగా యాప్ట్ అవుతుంది, గ‌తంలో రంగ స్థలంలో పూజా హెగ్డెకు కూడా ఆ పాట ప్ల‌స్ అయింది. అలాగే ఈ పాట మీకు కొత్త‌గా ఉంటుంద‌ని.. స‌మంత‌తో చెప్పాన‌ని.. దీంతో స‌మంత వెంట‌నే పాట‌ను చేసేందుకు అంగీక‌రించింద‌ని.. సుకుమార్ చెప్పారు. కాగా ఈ పాట ప్ర‌స్తుతం వివాదాల్లో చిక్కుకుంది. ఓ వైపు ఈ పాట‌ను తొల‌గించాల‌ని ఏపీకి చెందిన పురుష సంఘం కేసు పెట్ట‌గా.. చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment