Samantha : స‌మంత ప‌ట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి.. కార‌ణం అదే..!

December 18, 2021 8:28 AM

Samantha : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప‌. ఈ మూవీ డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. అయితే ఇందులో స‌మంత ఓ ప్ర‌త్యేక‌మైన పాట‌లో న‌టించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఫ్యాన్స్ ఆమె ప‌ట్ల తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

fans are very much unhappy with Samantha attitude

పుష్ప మూవీని చూసిన ప‌లువురు ఫ్యాన్స్ సినిమా అంతా బాగుంద‌ని.. అయితే స‌మంత పాట న‌చ్చ‌డం లేద‌ని అంటున్నారు. స‌మంత ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంద‌ని, ఆమెకు హీరోయిన్‌గా మంచి ఫ్యూచ‌ర్ ఉంద‌ని.. అలాంట‌ప్పుడు ఇలాంటి ఐట‌మ్ సాంగ్‌ల‌లో న‌టిస్తూ స్కిన్ షో చేయ‌డం ఎందుక‌ని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్య‌క్త ప‌రిచారు.

స‌మంత సాంగ్‌లో అస‌లు ఏమీ లేద‌ని, ఆమె డ్యాన్స్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌ని, గ్లామ‌ర్ షోకే ప్రాధాన్య‌త‌ను ఇచ్చింద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె అస‌లు ఇలాంటి సాంగ్స్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఈ సాంగ్ వ‌ల్ల పెద్ద‌గా సినిమాకు ఒరిగింది ఏమీ లేద‌ని, సినిమా మొత్తం బాగున్న‌ప్ప‌టికీ స‌మంత పాట అన‌వ‌స‌రంగా ఉంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment