కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇచ్చే స‌ర్టిఫికెట్‌తో ఏమైనా ఉప‌యోగం ఉంటుందా ?

May 8, 2021 2:04 PM

దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం నెమ్మ‌దిగా సాగుతోంది. జ‌న‌వ‌రి 16, 2021వ తేదీన అట్ట‌హాసంగా టీకాల పంపిణీని ప్రారంభించినా ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు భారీ ఎత్తున టీకాల‌ను తీసుకునేందుకు కేంద్రాల‌కు వెళ్తుండ‌డంతో టీకాలకు కొర‌త ఏర్ప‌డింది. దీంతో చాలా చోట్ల కొత్త వారికి టీకాల‌ను ఇవ్వడం లేదు. కేవ‌లం రెండో డోసు టీకాల‌ను మాత్ర‌మే ఇస్తున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత స‌ర్టిఫికెట్ త‌ప్ప‌కుండా ఇస్తారు. మ‌రి ఆ స‌ర్టిఫికెట్‌తో త‌రువాత మ‌న‌కు ఏదైనా ఉప‌యోగం ఉంటుందా ? అంటే…

what is the use of covid vaccine certificate

కోవిడ్ టీకా తీసుకున్న త‌రువాత ప్ర‌తి ఒక్క ల‌బ్దిదారుడికి స‌ర్టిఫికెట్‌ను క‌చ్చితంగా అంద‌జేస్తారు. రెండు డోసుల టీకాను తీసుకున్నాకే స‌ర్టిఫికెట్‌ను ఇస్తారు. దాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంద‌జేస్తుంది. టీకా స‌ర్టిఫికెట్‌పై ల‌బ్ధిదారుడి పేరు, వ‌య‌స్సు, లింగం, ఐడీ వివ‌రాలు ఉంటాయి. అలాగే ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు (కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్‌) అనే వివ‌రాల‌తోపాటు, టీకాలు తీసుకున్న తేదీలు, ఎవ‌రు టీకా వేశారు, ఎక్క‌డ వేశారు, రెండు టీకా డోసుల‌కు ఎంత గ్యాప్ ఇచ్చారు ? అనే వివ‌రాలు స‌ర్టిఫికెట్ ద్వారా తెలుస్తాయి.

అయితే టీకా రెండు డోసులు తీసుకున్న త‌రువాత స‌ర్టిఫికెట్ ను పొందుతాం. కానీ దాంతో త‌రువాత ఏం ఉప‌యోగం ఉంటుంది ? అంటే.. విదేశాల‌కు వెళ్లేవారికి ఈ స‌ర్టిఫికెట్ ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వ‌చ్చిన‌ట్లు భావిస్తారు. దీంతో కోవిడ్ ఆంక్ష‌లు ఉండ‌వు. సుల‌భంగా విదేశాల‌కు వెళ్ల‌వ‌చ్చు. ముందు ముందు కోవిడ్ టీకాల‌ను తీసుకున్న వారినే అనుమ‌తిస్తాం, వారిపై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు, వారు మాస్కుల‌ను ధ‌రించాల్సిన ప‌నిలేదు.. అంటే.. అలాంటి సంద‌ర్భాల్లో ఈ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం అవుతుంది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు రుజువు ఉంటుంది. ఇది హాస్పిట‌ల్స్‌లో ప‌నిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చికిత్స‌ను తీసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now