Allu Arjun : మ‌గ‌బుద్ది వంక‌ర బుద్ధి లిరిక్స్‌పై బ‌న్నీ స‌మాధానం వింటే షాక‌వ్వాల్సిందే..!

December 18, 2021 6:20 PM

Allu Arjun : ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా పుష్ప హ‌డావిడి న‌డుస్తోంది. ఇందులో స‌మంత స్పెష‌ల్ సాంగ్ చేయ‌గా, ఆ సాంగ్‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయో మ‌నంద‌రం చూశాం. పురుషులందరినీ చెడ్డగా చూపించేలా ఈ పాట ఉందని, ఈ సాంగ్‌ బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌ చేసింది పురుషుల సంఘం. తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలోని ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అనే లిరిక్స్‌ వివాదం రేపుతున్నాయి.

Allu Arjun replied about controversy in samantha song

ఈ పాటను తొలగించకుంటే ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, గేయరచయితపై కేసు పెడతామని హెచ్చరించింది. ‘ఓ సొల్‌రియా’ అనే పాట తమిళంలోనూ సూపర్‌ హిట్‌ అయింది. కానీ ఈ వివాదం యూనిట్‌కి కాస్త ఆందోళ‌న క‌లిగించింది. అయితే ఇదే పాట‌పై ఓ రిపోర్ట‌ర్ బ‌న్నీని ప్ర‌శ్నించాడు.

పుష్ప ప్రమోషన్లలో పాల్గొన్న అల్లు అర్జున్ ని.. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్‌ బన్నీని ప్రశ్నించగా.. ‘లిరిక్స్‌లో తప్పు లేదు, ఇదే నిజం’ అంటూ షాకింగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే మ‌హిళ‌లు ఈ సాంగ్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌, చంద్ర‌బోస్‌పై పాలాభిషేకం కురిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now