దారుణం: కరోనా నుంచి కోలుకున్నారు.. కళ్ళు పోగొట్టుకున్నారు!

May 8, 2021 4:13 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. మరికొంతమంది వ్యాధి నుంచి కోలుకునప్పటికీ ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారు కంటి చూపు కోల్పోతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.

తాజాగా గుజరాత్ లోని సూరత్‌లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫంగస్ బారినపడి సుమారు 40 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు.సూరత్‌లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించగా వైద్యులు పరిశీలిస్తే బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్మిసిస్‌) అనేది రావడంతో వారి చూపు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.

ఈ విధమైనటువంటి ఫంగస్ ఏర్పడటం వల్ల ఎంతో ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా రక్తపోటు,షుగర్ వంటి వ్యాధుల సమస్యతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయనీ డాక్టర్లు చెబుతున్నారు.ఈ ఫంగస్ వల్ల కొందరు కంటి చూపు కోల్పోగా మరి కొందరిలో మరణం కూడా సంభవిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now