Samantha : స‌మంతకు అస్వ‌స్థ‌త‌.. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది ?

December 13, 2021 4:14 PM

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. తాజాగా ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైంద‌ని సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం న‌డుస్తోంది. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత ప్రస్తుతం జర్వం, జలుబుతో బాధపడుతోంది. ద‌గ్గు కూడా ఎక్కువగా వ‌స్తుండ‌డంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకుంది.

Samantha got health problems now how is she

స‌మంత ఆరోగ్యానికి సంబంధించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్న నేప‌థ్యంలో స‌మంత మేనేజ‌ర్ తాజ‌గా క్లారిటీ ఇచ్చారు. సమంత పూర్తిగా ఆరోగ్యంతో ఉందని కొంచెం దగ్గు ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసిందని తెలిపారు. ప్రస్తుతం సామ్‌ విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను నమ్మొద్దని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

‘ఏమాయ చేశావే’ చిత్రంతో పరిచయమైన స‌మంత‌ 2017లో నాగ చైతన్య‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్ప‌టి నుండి స‌మంత లైఫ్ కొత్త‌గా క‌నిపిస్తోంది. నిత్యం హాట్ టాపిక్‌గా మారుతోంది. మరోవైపు ప్రస్తుతం సామ్‌ వరుస సినిమాలు ఓకే చేస్తోంది. ‘యశోద’, ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లకు పచ్చజెండా ఊపిన ఆమె బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్‌లను ఓకే చేసినట్లు సమాచారం. ‘పుష్ప’లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో సామ్‌ నటించింది. ఆ పాటకు చెందిన లిరికల్‌ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment