Bigg Boss 5 : 14 వారాలు బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న కాజల్‌.. ఎంత మొత్తం అందుకుందో తెలుసా..?

December 13, 2021 10:03 AM

Bigg Boss 5 : అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు చేరుకుంది. ఈ షోలో ఇంకో వారమే మిగిలి ఉంది. హౌజ్ నుండి చివ‌రిగా కాజ‌ల్ ఎలిమినేట్ అయింది. ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 5 kajal evicted from house do you know how much she got

 

ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత అనీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి సైతం హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత- ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పుడు కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే ఉన్నారు.

అయితే చివ‌రిగా ఎలిమినేట్ అయిన కాజ‌ల్ గ‌తంలో తనకు రూ.30 లక్షల అప్పు ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యున‌రేష‌న్‌తో అది తీర్చుకోనుందనే టాక్ వినిపిస్తోంది. సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్‌ చేశారట! అంటే 14 వారాలకుగాను కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ మొదలయినప్పటి నుండి కాజల్‌కు నెగిటివిటీ ఎదురయినా.. గత కొంతకాలంగా తాను మానస్, సన్నీలతో ఉంటున్న తీరు తనకు హౌస్‌లోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా సపోర్ట్ పెంచేలా చేసింది. సన్నీకి ఉన్న ఫ్యాన్ బేస్ కాజల్‌కు కూడా కలిసొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment