Nithya Menon : ప్ర‌భాస్ ఇష్యూ వ‌ల్ల చాలా కుంగిపోయాను.. నిత్య మీనన్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

December 11, 2021 8:50 PM

Nithya Menon : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయనకి ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తాజాగా నిత్యామీన‌న్ ప్ర‌భాస్ మ్యాట‌ర్ తీసుకొచ్చి వార్త‌ల‌లో నిలిచింది. ‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ నిత్యామీనన్‌.. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తోంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తోంది.

Nithya Menon said prabhas issue is very sad to her

నిత్యా మీన‌న్ తాజాగా భీమ్లా నాయ‌క్ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్‌ 4న విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్‌ నిర్మాతగా కూడా మారింది. తాజాగా ఈ అమ్మ‌డు మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు జ్ఞాప‌కాల గురించి చెప్పుకొచ్చింది.

ప్రభాస్ ఇష్యూపై నిత్యా స్పందించడం గమనార్హం. నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే. ఆ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంది. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. మానసికంగా చాలా కుంగిపోయాను. అలా మొదలైంది తెలుగులో నా తొలి చిత్రం. ఆ సమయంలో నాకు తెలుగు సరిగా రాదు. తెలుగులో అప్పటి వరకు నేను ఏ సినిమా చూడలేదు. అలాంటి సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగితే అతనెవరో తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని చాలా పెద్దిగా చిత్రీకరించారు. అప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకున్నాను. మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని భావించాను.. అని నిత్యా చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment