సీఎం కేసీఆర్ సూచించిన మందులు ఇవి.. కోవిడ్ స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు వేసుకోవాలి..

May 7, 2021 1:55 PM

క‌రోనా సెకండ్ వేవ్ ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించే ప్ర‌స‌క్తే లేద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత ఆయ‌న తాజాగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు చేరుకుని చీఫ్ సెక్రెట‌రీ సోమేష్ కుమార్‌, ఇత‌ర వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో క‌లిసి రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. అందులో భాగంగానే ఆయ‌న లాక్‌డౌన్ విధించ‌బోమని తెలిపారు. అయితే స‌మీక్షా స‌మావేశం అనంత‌రం ఆయ‌న కోవిడ్ స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఏయే మెడిసిన్లు వేసుకోవాలో వివ‌రించారు. వాటికి సంబంధించిన చిత్రాల‌ను కింద అంద‌జేయ‌డం జ‌రుగుతుంది. గ‌మ‌నించ‌గ‌ల‌రు.

cm kcr suggested these medicines for covid mild and moderate patients

పైన తెలిపిన విధంగా మెడిసిన్ల‌ను కోవిడ్ స్వ‌ల్ప‌, మ‌ధ్యస్థ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు వాడాల్సి ఉంటుంది. కోవిడ్‌కు సంబంధించి స్వ‌ల్ప ల‌క్షణాలు ఉన్నా స‌రే నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని, వెంట‌నే పైన తెలిపిన విధంగా మందుల‌ను వేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

కోవిడ్ స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు చాలా మంది టెస్టులు చేయించుకోవ‌డం లేద‌ని, ప‌రిస్థితి చేయి దాటాక హాస్పిట‌ల్స్‌కు వ‌స్తున్నార‌ని, అలాంటి స్థితిలో డాక్ట‌ర్లు కూడా ఏమీ చేయ‌లేర‌ని అన్నారు. క‌నుక ల‌క్షణాలు క‌నిపించిన వెంట‌నే పైన తెలిపిన మందుల‌ను వేసుకుంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌రం కాకుండా ఉంటుంద‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment