Bigg Boss 5 : బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్ ఈ కంటెస్టెంటేనా..?

December 8, 2021 10:45 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ఎంతో ఉత్కంఠ‌గా కొన‌సాగుతోంది. మ‌రో 10 రోజుల్లో ఈ సీజ‌న్ ముగియ‌నుంది. దీంతో ఈ సీజ‌న్‌కు ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు ? అన్న విషయంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విష‌యంలో ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. ఇక టైటిల్ విన్న‌ర్ ఎవ‌రు ? అనే విష‌యంపై కూడా స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.

Bigg Boss 5 title winner is may be this contestant

ఈ వారంలో ఒక‌రు ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వెళితే మిగిలిన 5 మందిలో ఒక‌రు టైటిల్ గెలుచుకుంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం హౌస్‌లో స‌న్నీ, మాన‌స్‌, ష‌ణ్ముఖ్‌, శ్రీ‌రామ్ చంద్ర‌, కాజ‌ల్‌, సిరి ఉండ‌గా.. మాన‌స్‌, కాజ‌ల్ ల‌కు ఈ వారం త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

అయితే కాజ‌ల్‌, మాన‌స్‌లు ఇద్ద‌రూ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కాజ‌ల్ కు ఇంకా ఎక్కువ‌గా ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇక ష‌ణ్ముఖ్ లేదా శ్రీ‌రామ్‌లలో ఒక‌రు విన్న‌ర్ టైటిల్‌ను ఎగ‌రేసుకుపోతార‌ని అంటున్నారు. మ‌రి ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు.. ఎవ‌రు విన్ అవుతార‌నేది చూడాలి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలెను డిసెంబ‌ర్ 19వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు గాను ప‌లువురు హీరోయిన్ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారు ఫినాలెలో ప్ర‌త్యేక గీతాల‌తో అల‌రిస్తార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment