ప‌బ్లిక్ మ‌ధ్య జ‌స్వంత్‌కు ముద్దు పెట్టిన ప్రియాంక..!

December 7, 2021 12:34 PM

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో అడ‌పాద‌డ‌పా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తూ వ‌చ్చిన ప్రియాంక ఇప్పుడు బిగ్ బాస్ షోతో త‌న క్రేజ్ ను మ‌రింత పెంచుకుంది. సెప్టెంబరు 5న మొదలైన సీజన్‌ 5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టి.. మొత్తం 91 రోజులు ఉండటం గమనార్హం. తమన్నా సింహాద్రి తర్వాత తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రెండో ట్రాన్స్‌జెండర్‌గా పింకీ నిలిచింది.

priyanka singh kisses jessie in public

ఏమాత్రం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేకుండా హౌస్‌లోకి వచ్చిన ప్రియాంక‌ దాదాపు 90 రోజుల పాటు హౌస్‌లో ఉండటం మామూలు విషయం కాదు. ఆమె ఎలిమినేట్ విష‌యాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. అయితే ప్రియాంక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అభిమానుల నుండి గ్రాండ్ వెల్‌క‌మ్ ల‌భించింది. రోడ్ ర్యాలీగా ప్రియాంక ప్రయాణం సాగింది. అయితే ర్యాలీలో ఈ సీజ‌న్‌లో పాల్గొన్న ఉమాదేవి, జ‌స్వంత్‌లు కూడా ఆమెని క‌లిశారు.

ప్రియాంక.. జ‌స్వంత్ కి అంద‌రి మ‌ధ్య‌లో నుదుటిపై ముద్దు పెట్టింది. ఈ స‌న్నివేశం చూసి షాక్ అయ్యారు. జ‌స్వంత్‌తో హౌజ్‌లో అంటీ ముట్ట‌న‌ట్టు ఉన్న ప్రియాంక‌.. బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం అతనికి ముద్దులు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి ప్రియాంక చాలా సంతోషించింది. త‌న‌ను స‌పోర్ట్ చేసిన వారికి పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now