Evaru Meelo Koteeshwarulu : ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు.. ఎన్‌టీఆర్ ప్ర‌శ్న‌ల‌కు రెండు సార్లు ఇబ్బంది ప‌డ్డ మ‌హేష్‌..

December 6, 2021 12:04 PM

Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ (NTR) జెమిని టీవీ (Gemini TV)లో చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు (Evaru Meelo Koteeshwarulu) షోకు మంచి ఆద‌ర‌ణే ల‌భిస్తోంది. సెల‌బ్రిటీలు గెస్ట్‌లుగా వ‌చ్చిన‌ప్పుడు మాత్రం రేటింగ్స్ ఒక రేంజ్‌లో ఉంటున్నాయి. ఇక తాజా ఎపిసోడ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌కు ఫ్యాన్స్ నుంచి విశేషమైన రీతిలో స్పంద‌న ల‌భించింది. నిర్వాహ‌కులు అనుకున్న‌దానిక‌న్నా ఎక్కువ వినోదాన్ని అందించారు. దీంతో ఇద్ద‌రు స్టార్స్‌కు చెందిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Evaru Meelo Koteeshwarulu mahesh babu little bit tense over ntr questions

ఇక ఈ ఎపిసోడ్‌లో భాగంగా మ‌హేష్‌ను ఎన్‌టీఆర్ ప‌లు తిక‌మ‌క పెట్టే ప్ర‌శ్న‌లు అడిగారు. దీంతో మ‌రింత వినోదం ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ మ‌హేష్ త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పారు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ పాల్గొన్న ఎపిసోడ్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగింది. అయితే ఈ షోలో మ‌హేష్‌ని రెండు ప్ర‌శ్న‌లు బాగానే ఇబ్బంది పెట్టాయ‌ని చెప్ప‌వచ్చు. దీంతో ఆయ‌న‌హెల్ప్‌లైన్ వాడుకున్నారు.

మొద‌ట 10 ప్ర‌శ్న‌ల వ‌ర‌కు మ‌హేష్ ఎలాంటి హెల్ప్‌లైన్ వాడుకోకుండానే సమాధానాలు చెప్పారు. దీంతో 3 హెల్ప్‌లైన్స్ అలాగే ఉండిపోయాయి. ఈ క్ర‌మంలోనే 11వ ప్ర‌శ్న కింద మ‌హేష్‌కు ఎన్‌టీఆర్ చ‌రిత్ర‌కు సంబంధించిన ప్ర‌శ్న వేశారు. హరిహర రాయలు, బుక్కరాయలు ఏ రాజవంశానికి చెందినవారని అడిగారు. ఈ ప్రశ్నకు మహేష్ తడబడ్డారు. దీంతో హెల్ప్ లైన్ తీసుకున్నారు. మహేష్ ఫేవరేట్ దర్శకులలో ఒకరైన కొరటాల శివకు వీడియో కాల్ చేశారు. కొరటాల శివ సంగమ రాజవంశం అని రైట్ ఆన్సర్ చెప్పారు.

ఇక 12వ ప్రశ్నగా ఫుట్ బాల్‌కు చెందిన అంశం గురించి అడిగారు. అయితే దీనికి మహేష్ ఈజీగా జవాబు చెప్పారు. ఇక 13వ ప్ర‌శ్న‌కు మ‌హేష్ మ‌ళ్లీ టెన్ష‌న్ ప‌డ్డారు. ఈ ప్ర‌శ్న‌కు కూడా ఆయ‌న హెల్ప్ లైన్ వాడుకున్నారు. జంతువు బొమ్మ లేని లోగో ఉన్న కార్ బ్రాండ్ పేరు చెప్పాలని మహేష్ ని ఎన్టీఆర్ అడ‌గ్గా.. హెల్ప్ లైన్ ద్వారా నాలుగు ఆప్షన్స్ లో రెండు రాంగ్ ఆన్సర్స్ ను తొలగించారు. ఫెర్రారీ, లాంబోర్గిని రెండు ఆప్షన్స్ లో.. లాంబోర్గిని అని మహేష్ స‌రైన స‌మాధానం చెప్పారు.

కాగా ఆదివారం ఎపిసోడ్ అయిపోయే వ‌ర‌కు మ‌హేష్ మొత్తం 13 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పి రూ.25 ల‌క్ష‌లు గెలుచుకున్నారు. త‌రువాతి ఎపిసోడ్‌ళో ఆయ‌న రూ.50 ల‌క్ష‌లు, రూ.1 కోటి కి చెందిన ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోనున్నారు. అయితే మ‌హేష్ షోలో రూ.25 ల‌క్ష‌లు మాత్ర‌మే గెలుచుకున్నార‌ని ఇప్ప‌టికే వార్త లీకైంది. దీంతో ఆయ‌న త‌రువాతి రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment