Bigg Boss 5 : మాన‌స్ అస‌లు రూపం చూపించిన అరియానా.. క‌న్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక‌..

December 6, 2021 2:02 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. 19 మందితో మొద‌లైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురు మాత్ర‌మే ఉన్నారు. తాజాగా 13వ కంటెస్టెంట్‌గా ప్రియాంక బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే తమన్నా లా పింకీ అరిచి గోలగోల చేయలేదు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప కంటెస్టెంట్లతో పెద్దగా గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. తనకు ఇష్టమైన కిచెన్‌ రూంలోనే గడుపుతూ హౌస్‌మేట్లకు ఇష్టమైన ఆహార పదార్థాలు వండిపెట్టింది. అప్పుడ‌ప్పుడూ మాన‌స్ ప‌ర‌ధ్యానంలో ఉండేది.

Bigg Boss 5 ariyana shown real character of manas and priyanka cried

మాన‌స్‌పై ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్న ప్రియాంక‌కి అరియానా పెద్ద షాక్ ఇచ్చింది. ఎలిమినేట్ అయిన త‌ర్వాత అరియానా బ‌జ్‌లో పాల్గొన‌గా, అందులో అరియానా ప‌లు టాస్క్‌లు ఇచ్చింది. టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‏కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. ఇక పంచ్ సింబల్ మాత్రం మానస్‏కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా.. అంటూ సమాధానమిచ్చింది.

టైటిల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారని అడగ్గా.. మానస్ అంటూ బదులిచ్చింది పింకీ. దీంతో మానస్, కాజల్.. ప్రియాంక గురించి వీడియోను చూపించి షాకిచ్చింది అరియానా. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. మానస్‏కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా.. అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment