క్రిష్ తన భార్యతో విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్..?

May 6, 2021 8:03 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో క్రిష్ ఒకరు. విభిన్న కథాంశంతో సినిమాలను తెరకెక్కించే మంచి గుర్తింపును సంపాదించుకున్న క్రిష్ 2016 ఆగస్టు 7న రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ మైన కొంత సమయంలోనే వీరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

పెళ్లి చేసుకున్న కొంత సమయానికి భార్యతో విడిపోవడంతో అప్పట్లో ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఈ దంపతులిద్దరూ విడిపోవడానికి గల కారణం ఒక హీరోయిన్ అనే సమాచారం గట్టిగా వినిపిస్తోంది. దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించే సినిమాలో ఓ హీరోయిన్ తో చాలా చనువుగా ఉండటం వల్ల రమ్య తన భర్తను పలుమార్లు ప్రశ్నిస్తూ తరచూ గొడవ పడేది.

ఈ క్రమంలోనే ఈ దంపతులిద్దరూ విడిపోవాలని నిశ్చయించుకొని 2018వ సంవత్సరంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు కూడా వీరికి విడాకులు ఇవ్వడంతో ఈ జంట విడిపోయింది. అయితే దర్శకుడు క్రిష్ తో చనువుగా ఉన్న హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఏమిటి అనే విషయాలు మాత్రం బయటికి రావడం లేదు. ఇక సినిమాల విషయానికొస్తే క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “హరహర వీరమల్లు” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now