Tollywood : టాలీవుడ్‌కు మ‌ళ్లీ ఆ భ‌యం ప‌ట్టుకుందా ?

December 4, 2021 12:07 PM

Tollywood : క‌రోనా మొద‌టి వేవ్‌.. ఆ త‌రువాత రెండో వేవ్‌.. రెండింటి మూలంగా అనేక రంగాల‌కు తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లింది. వాటిల్లో సినీ రంగం కూడా ఒక‌టి. చాలా చిత్రాలు నిర్మాణ ద‌శ‌లో ఆగిపోగా.. కొన్ని నిర్మాణం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్ వ‌ద్ద నిలిచాయి. కొన్ని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అలాంటి స‌మ‌యాల్లో క‌రోనా రెండు ద‌శలు వ‌చ్చి నాశ‌నం చేశాయి. దీంతో సినిమాల‌ను ఏదో ఒక విధంగా పూర్తి చేసి చాలా మంది నిర్మాత‌లు ఓటీటీల‌కు ఇచ్చేశారు. న‌ష్టాల‌ను త‌గ్గించుకున్నారు.

అయితే అంతా బాగానే ఉంది, స‌ద్దుమ‌ణుగుతోంది.. అనుకుంటున్న త‌రుణంలో టాలీవుడ్‌ను మ‌రోసారి క‌రోనా భ‌యం వెంటాడుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే 38 దేశాల్లో క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కోవిడ్ మూడో ద‌శ వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా పేరు చెబితేనే టాలీవుడ్ భ‌య‌ప‌డుతోంది.

Tollywood is once again fearing for that word

ప్ర‌స్తుతానికి ఒమిక్రాన్ వేరియెంట్ ప్ర‌భావం అంత‌గా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను ర‌న్ చేస్తున్నారు. అయితే ముందు ముందు కేసులు పెరిగితే ముందుగా స్కూళ్లు, సినిమా థియేట‌ర్ల‌పైనే వేటు ప‌డుతుంది. క‌నుక రానున్న రోజుల్లో పెరిగే కేసుల సంఖ్యపై టాలీవుడ్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కేసుల సంఖ్య పెరిగితే గ‌న‌క క‌చ్చితంగా ఆంక్ష‌ల‌ను విధిస్తారు. అప్పుడు ముందుగా మూత ప‌డేది థియేట‌ర్లేన‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో టాలీవుడ్‌కు మ‌రోమారు క‌రోనా భ‌యం ప‌ట్టుకుంద‌ని తెలుస్తోంది.

అయితే ఇప్ప‌టిక‌ప్పుడు జ‌రిగే న‌ష్టం ఏమీ లేక‌పోయినా.. కోవిడ్ మూడో వేవ్ వ‌చ్చి థియేట‌ర్లు మూత ప‌డితే పెద్ద సినిమాల‌కు చాలా న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇప్ప‌టికే రిలీజ్ డేట్స్‌ను కూడా ప్ర‌క‌టించేశారు. ఈ త‌రుణంలో థియేట‌ర్లు మూత ప‌డితే సినిమాల‌ను మ‌ళ్లీ వాయిదా వేయాల్సి వ‌స్తుంది. ఆ త‌రువాత 6 నెల‌లకు గానీ మూడో వేవ్ త‌గ్గే అవ‌కాశం ఉండదు. అప్ప‌టికి మ‌రిన్ని సినిమాల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతాయి. దీంతో సినిమాల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంది. అప్పుడు థియేట‌ర్లు దొర‌క‌వు. దీంతో అది కొత్త స‌మ‌స్య‌కు దారి తీస్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా మూడో వేవ్ రావొద్ద‌నే టాలీవుడ్ కోరుకుంటోంది. మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now