Viral Video : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పానీపూరీ వ్యాపారి వీడియో.. ఇంత‌కీ అందులో ఏముంది..?

December 2, 2021 12:47 PM

Viral Video : పానీపూరీలంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది బ‌య‌ట ల‌భించే పానీ పూరీల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక కొంద‌రు ఇంట్లోనే వాటిని త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే ఆ పానీ పూరీ షాపు ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అక్క‌డ అనేక ర‌కాల వెరైటీల‌కు చెందిన పానీపూరీల‌ను త‌యారు చేస్తుంటారు.

Viral Video kanpur panipuri vendor excellent english speaking skills

అయితే ఆ పానీ పూరీలు త‌యారు చేసే అత‌ని గురించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. అత‌ని పేరు రాహుల్‌. పానీ పూరీల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తుంటాడు. అత‌నికి కాన్‌పూర్‌లో ముర‌ళీ ప‌టాశె వాలా అనే ఓ పానీపూరీ షాపు ఉంది. అక్క‌డ వెరైటీ పానీపూరీలు ల‌భిస్తాయి. దీంతో ర‌ద్దీ ఎక్కువ‌గానే ఉంటుంది.

అయితే రాహుల్ డిగ్రీ చ‌దివాడు. అయిన‌ప్ప‌టికీ నామోషీ అనుకోకుండా పానీ పూరీల వ్యాపారం చేస్తున్నాడు. ఇక ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు చెందిన వ్య‌క్తి అత‌ని వీడియోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ ల‌లో పోస్ట్ చేయ‌గా.. దానికి ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. అన్ని వ్యూస్ ఆ వీడియోకు రావ‌డానికి గల కార‌ణం ఏమిటంటే.. రాహుల్ ఇంగ్లిష్ లో మాట్లాడ‌డ‌మే. అవును.. పానీపూరీ అమ్మే వ్య‌క్తి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నాడ‌ని.. చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Myself Rahul. A very common name. And we are the famous graduate golgappe vaala. My father is very famous for his paanipuri and we use homemade masalas to make everything.. అని రాహుల్ తెలిపాడు.

https://www.instagram.com/reel/CW0nziyFCBh/?utm_source=ig_embed&ig_rid=34932030-97d5-4dc3-9d7b-5326efb4be13

త‌న పేరు రాహుల్ అని.. అది అంద‌రికీ ఉండే ఒక కామ‌న్ పేరు అని అన్నాడు. తాను గ్రాడ్యుయేట్ అని, త‌న తండ్రి పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడ‌ని, అందులో తాను కూడా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపాడు. తాము ఇంట్లో త‌యారు చేసిన అనేక మ‌సాలాల‌ను ఉప‌యోగించి పానీపూరీల‌ను త‌యారు చేసి అందిస్తామ‌ని తెలిపాడు. కాగా రాహుల్ కు చెందిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment