Bigg Boss 5 : నాకు కాబోయే వైఫ్ సిరిలా ఉండాల‌ని.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ జ‌స్వంత్..

December 2, 2021 8:46 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక కొంద‌రి మ‌ధ్య బాండింగ్ ఏర్ప‌డ‌డం స‌హ‌జం. ఈ సీజ‌న్‌లో త్రిమూర్తుల మాదిరిగా సిరి, ష‌ణ్ముఖ్‌, జ‌స్వంత్ క‌లిసి గేమ్ ఆడారు. ఇంట్లో వీళ్లు ఫ్రెండ్స్ మాదిరిగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ లోప‌ల వేరే రిలేష‌న్ మెయింటైన్ చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం సిరితో ష‌ణ్ముఖ్ ఎంత క్లోజ్‌గా ఉంటున్నాడో మ‌నం చూస్తూనే ఉన్నాం.

Bigg Boss 5  jessie told that his would be wife should be like siri

ఇక అనారోగ్యంతో హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌స్వంత్ .. సిరిపై త‌న‌కున్న ప్రేమ‌ను తెలియ‌జేశాడు. హౌజ్‌లో సిరి‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాడు జెస్సీ. అయితే ఎలిమినేషన్ తరువాత కూడా సిరిపై అదే అభిమానాన్ని చూపిస్తున్నాడు జెస్సీ. తాజాగా జెస్సీ సిరిలాంటి అమ్మాయి తనకి భార్యగా కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నాకు లవ్ ప్రపోజ్‌లు వస్తున్నాయి.

నేను మోడల్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఐ లవ్యూ చెప్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు అందరూ జెస్సీ ఐ లవ్యూ, ఐ లవ్యూ.. అంటున్నారు. అది ఏ లవ్వో అర్థం కావడంలేదు. అందుకే నేను తిరిగి ఐ లవ్యూ చెప్తున్నా. కలిసి మాట్లాడుకున్నప్పుడు అభిప్రాయాలు కలుస్తాయి. నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే.. సిరిలా ఉండాలి. సిరిలో ఉన్న క్వాలిటీస్ నాకు కాబోయే భార్యకి ఉండాలి. సిరి నన్ను ఎలా చూసుకుందో మీరంతా చూశారు. నేను ఏం చెప్పినా సిరి వినేది. అలాంటి అమ్మాయి కావాల‌ని షాకింగ్ కామెంట్స్ చేశాడు జ‌స్వంత్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment