పులిహోర ప్రసాదంగా మారడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

May 5, 2021 4:12 PM

మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలో పులిహోరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పులిహోరకు ఇంతటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

పురాణాల ప్రకారం పాండవులలో భీష్ముడు వంటవాడిగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఎన్నో వంటలను అద్భుతంగా తయారుచేసిన భీముడు ఆ వంటలలో పులిహోర కూడా ఉంది. అదేవిధంగా చోళుల పరిపాలన కాలంలో దేవుడికి నైవేద్యంగా పూలు, పండ్లు సమర్పించేవారు. కానీ వైష్ణవులు అయ్యంగార్లు  దేవుడికి పులిహోర నైవేద్యంగా సమర్పించేవారు. రానురాను ఇదే పులిహోర భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వచ్చింది.

పులిహోర కూడా చూడటానికి పసుపు రంగులో ఉండటం వల్ల ఈ నైవేద్యాన్ని ఒక శుభసూచకంగా పరిగణిస్తారు. ఇటు ఆధ్యాత్మికంగాను అటు ఆరోగ్య పరంగాను పులిహోర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పులిహోరను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి రాశిగా పోసి ఆ వేంకటేశ్వరునికి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు. ఈ విధంగా మన దేవాలయాల్లో పులిహోరకు అంతటి ప్రాధాన్యత లభించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment