Shilpa Chowdary : శిల్పా చౌదరి మాయలో పడిన టాలీవుడ్ స్టార్ హీరో ?

November 30, 2021 9:18 PM

Shilpa Chowdary : గత కొద్ది రోజుల నుంచి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించి కోట్ల కొద్దీ డబ్బును మాయ చేసిన శిల్ప చౌదరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ సమయంలోనే ఈమె మాయలో ఎంతోమంది బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పడి కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్నారు.  గత కొద్దిరోజుల నుంచి ఈమె మాయలో పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.

Shilpa Chowdary : శిల్పా చౌదరి మాయలో పడిన టాలీవుడ్ స్టార్ హీరో ?

తాజాగా శిల్పా చౌదరి మాయలో ఒక టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కుటుంబం కూడా పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో విలన్ పాత్రలలో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాలలో అతని పేరు పెద్ద ఎత్తున వినబడుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న అతని కుటుంబ సభ్యులు కూడా ఈమె మాయలో పడి ఏకంగా రూ.కోట్లలో డబ్బు నష్టపోయారని తెలుస్తోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు, ఓ న్యాయమూర్తి కుటుంబం కూడా శిల్పా చౌదరికి కోట్లల్లో డబ్బులు ఇచ్చి పూర్తిగా మోసపోయారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం సంచలనంగా మారుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment