Shiva Shankar Master : శోక సంద్రంలో టాలీవుడ్‌.. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌న్నుమూత‌..

November 28, 2021 10:04 PM

Shiva Shankar Master : ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ గ‌త కొద్ది రోజులుగా క‌రోనాతో బాధ‌ప‌డుతూ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న విష‌యం విదిత‌మే. కాగా ఆయ‌న కొంత‌సేప‌టి క్రితం క‌న్నుమూశారు. ఆదివారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు.

Shiva Shankar Master : శోక సంద్రంలో టాలీవుడ్‌.. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ క‌న్నుమూత‌..

ఇటీవలే క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న‌ను గ‌చ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయ‌న ఆర్థిక స్థితి బాగాలేక‌పోవ‌డంతో ప‌లువురు హీరోలు ఆయ‌న‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ 75 శాతం సోకింది. ఈ క్ర‌మంలో హాస్పిట‌ల్‌లో వైద్యులు ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స‌ను అందించారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌ర‌కు ఆయ‌న క‌న్నుమూశారు.

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌కు సోనూసూద్‌, ధ‌నుష్, చిరంజీవి, మంచు విష్ణు త‌దిత‌రులు ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. కాగా ఆయ‌న భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 10 భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో ప‌నిచేశారు. డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ఎంత‌గానో పేరు తెచ్చుకున్నారు. ప‌లు సినిమాల్లో న‌టించ‌డంతోపాటు టీవీల్లో ప‌లు డ్యాన్ష్ షోల‌కు జడ్జిగా హాజ‌రై పేరుగాంచారు. ఆయ‌న మృతి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోట‌ని ప‌లువురు ప్ర‌ముఖులు పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment