Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కోసం రంగంలోకి దిగిన కేజీఎఫ్ 2 విలన్ !

November 28, 2021 6:15 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కోసం రంగంలోకి దిగిన కేజీఎఫ్ 2 విలన్ !

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఆయనతో తలపడటానికి బాలీవుడ్ నటుడు, కేజీఎఫ్ 2 విలన్ సంజయ్ దత్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దత్‌ తో సంప్రదింపులు జరపగా అందుకు సంజయ్ దత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక ఇప్పటికే చిరంజీవి కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ భోళా శంకర్ కోసం సంజయ్ దత్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now