వంద మందిని కాపాడిన డాక్టర్… ఒత్తిడితో చివరికి అలా!

May 3, 2021 11:43 PM

దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో డాక్టర్లు వైద్య సిబ్బంది కనిపించే దేవుళ్ళుగా కరోనాతో పోరాడుతున్న ఎంతోమందికి ప్రాణాలను నిలబెట్టారు. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్లు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తమ ముందే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసి పోవడంతో మానసిక ఆందోళన చెంది చివరకు తన ప్రాణాలను కూడా వదులుకున్నాడు ఆ డాక్టర్.

ఉత్తర్‌‌ప్రదేశ్‌‌లోని గోరఖ్‌‌పూర్‌‌కు చెందిన డాక‍్టర్‌ వివేక్‌ రాయ్‌ ఢిల్లీలోని మాళవీయనగర్‌ లో నివాసం ఉంటూ సౌత్‌ ఢిల్లీలోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ కరోనా సమయంలో వందల మంది ప్రాణాలను కాపాడిన వివేక్ మరెంతో మంది సరైన సదుపాయాలు లేక చనిపోవడంతో అతడు ఎంతో మానసికంగా ఆందోళన చెందాడు. ఈ మానసిక ఆందోళనలో పడి తన భార్య రెండు నెలల గర్భవతి అన్న విషయం కూడా మర్చిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డాక్టర్ వివేక్ కి గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. ప్రస్తుతం తన భార్య రెండు నెలల గర్భవతి. వివేక్ గత కొద్ది రోజులుగా ఐసీయూలో కరోనా పేషెంట్ లకు చికిత్స అందిస్తున్నారు.అయితే వీరిలో చాలా మంది పరిస్థితి విషమించి తన కళ్లెదురుగా ఎంతోమంది ప్రాణాలు పోవడంతో మానసికంగా ఆందోళన చెందిన డాక్టర్ వివేక్ శనివారం సాయంత్రం తన ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment