Akhanda Movie : క‌న్‌ఫాం.. అఖండ ప్రీ రిలీజ్ వేడుక‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌..!

November 25, 2021 8:38 PM

Akhanda Movie : నంద‌మూరి అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బాల‌కృష్ణ తాజా చిత్రం.. అఖండ‌. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. డిసెంబ‌ర్ 2న ఈ మూవీని విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Akhanda Movie allu arjun is the chief guest for pre release event

న‌వంబ‌ర్ 27న హైద‌రాబాద్‌లోని మాదాపూర్ శిల్ప‌క‌ళావేదిక‌లో అఖండ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

అఖండ ప్రీ రిలీజ్ వేడుక‌కు అల్లు అర్జున్ తోపాటు ప‌లు ఇత‌ర ముఖ్య అతిథులు కూడా వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవ‌రు అనేది తెలియ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ నుంచి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ అంద‌రినీ ఇప్ప‌టికే ఎంతో ఆకట్టుకున్నాయి.

అఖండ‌లో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోసించారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now