లేటెస్ట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసిన అనసూయ.. విమర్శిస్తున్న నెటిజన్లు..

May 3, 2021 11:12 AM

నటి, యాంకర్‌ అనసూయ పెట్టే పోస్టులు ఎప్పుడూ సోషల్‌ మీడియాలో వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఆమె సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులను లైక్‌ చేసే వారి కన్నా విమర్శించే వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ఆమె వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ ఓ ఫొటోషూట్‌ చేసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.

anasuya posted latest photos netizens criticize her

అనసూయ నటించిన తాజా మూవీ థాంక్యూ బ్రదర్‌ మే 7వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. దీంతో ఆ మూవీ ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉంది. అయితే మూవీ ప్రమోషన్‌ నేపథ్యంలో బ్లాక్‌ డ్రెస్‌తో ఆమె ఫొటోషూట్‌ చేసింది. తరువాత ఆ ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే ఆమె ఫొటోలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ఆమె కురచ దుస్తులు ధరించి ఉండడంతో ఆమెను మళ్లీ టార్గెట్‌ చేశారు.

కరోనా నేపథ్యంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని, చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఇటీవలే ఆమె సోషల్‌ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. అయితే దాన్ని ఉద్దేశించి తాజాగా ఆమె పెట్టిన ఫొటోలను చూసి నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. మాస్కులు ధరించాలని పిలుపునిచ్చావు సరే, బాగానే ఉంది, కానీ నువ్వు ప్యాంట్‌ వేసుకోవడం మరిచిపోయావా ? అంటూ వారు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే తనను విమర్శించే నెటిజన్లకు అనసూయ కూడా దీటుగానే జవాబు ఇస్తుంది. మరి ఇందుకు ఆమె ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now