Mahesh Babu : వి.వి.వినాయక్‌ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా కన్నా ముందే..?

November 23, 2021 7:03 PM

Mahesh Babu : టాలీవుడ్  స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఈయన వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉన్నారు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమా అవకాశం అందుకుంటున్నాడు మహేష్. పలువురు దర్శకులు కూడా మహేష్ బాబు కోసం బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు కోసం మరో స్టార్ డైరెక్టర్ ముందుకు వచ్చారు.

Mahesh Babu  may act in vv vinayak movie

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు, వి.వి.వినాయక్. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ దర్శకుడిగా నిలిచారు. కానీ కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వరుస సినిమాలకు సైన్ చేసినట్లు తెలిసింది. కానీ ఈ ఇద్దరు దర్శకులకు ముందే వి.వి.వినాయక్ తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభమైతే ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మహేష్ బాబు, వి.వి.వినాయక్ స్పందించే వరకు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment