Prabhas : హీరో కాకుండా ఉంటే ప్రభాస్ ఆ పని చేసేవాడట..!

November 23, 2021 6:24 PM

Prabhas : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఈ బ్యాచిలర్ కుర్రాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరో కాకుండా ఉంటే తాను మరో పని చేసి ఉండేవాడట.

Prabhas said he would have done that if he is not become an actor

తొలిసారిగా ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రభాస్. ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోకపోయినా తర్వాత నటించిన వర్షం సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలా వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇక పాన్ ఇండియా మూవీ బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.

ప్రభాస్ తాను హీరో కాకపోతే మాత్రం రెస్టారెంట్ బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడట. ఈ విషయాన్ని గతంలో తానే స్వయంగా తెలిపాడు. తాను చదివిన చదువుకి ఇంటర్వ్యూలలో పాల్గొనే ఓపిక లేదని, హైదరాబాద్‌ లో ఉత్తరాది ఆహారాలకు చాలా డిమాండ్ ఉందని ఆ ఉద్దేశంతో రెస్టారెంట్ బిజినెస్ చెయ్యాలనుకున్నానని తెలిపాడు. కానీ హీరోగా అడుగు పెట్టాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి వరుస పాన్ ఇండియా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment