Vijay Sai : కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణం ఇదేనా?

November 23, 2021 2:43 PM

Vijay Sai : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న విజయసాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతూ విశేష ఆదరణ దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా విజయసాయి కెరీర్ లో మంచి స్థాయిలో ఉన్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈయన మరణం ఒక్కసారిగా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

these are the reasons for comedian vijay sai suicide

ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ అప్పట్లో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే విజయసాయి ఆత్మహత్యకు గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఈయన స్టార్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. అలాగే తన వైవాహిక జీవితంలోనూ మనస్పర్ధలు రావడం చేత అతనిని మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి నెట్టాయి. దీంతో ఆ బాధను భరించలేక తను హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటన జరగడం అప్పట్లో ఎంతో మంది అభిమానులని శోకసంద్రంలోకి నెట్టిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment