దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టండి.. టాస్క్ ఫోర్స్ మెంబ‌ర్ల సూచ‌న‌..

May 2, 2021 2:07 PM

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర‌త‌రం అవుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే దేశంలో మ‌రోసారి లాక్‌డౌన్ పెట్టాల‌ని ప్ర‌ధాని మోదీకి అంద‌రూ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. విదేశీ వైద్య నిపుణులు కూడా భార‌త్‌లో క‌ఠిన లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఇప్ప‌టికే సూచించారు. ఇక తాజాగా కోవిడ్ ప‌రిస్థితిని స‌మీక్షించ‌డం కోసం జాతీయ స్థాయిలో నియ‌మింప‌బ‌డ్డ టాస్క్ ఫోర్స్ స‌భ్యులు కూడా దేశంలో లాక్‌డౌన్ పెట్టాల‌ని మోదీకి సూచించారు.

national task force suggests modi to implement nation wide lock down once again

దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించ‌డం, కోవిడ్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం, కోవిడ్ నియంత్ర‌ణ వ్యూహాలను పర్యవేక్షించే నేష‌న‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ గ్రూప్ ఆన్ వాక్సినేష‌న్ (ఎన్ఈజీవీఏసీ) దేశంలో మరోమారు లాక్‌డౌన్ పెట్టాల‌ని మోదీకి సూచించింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మ‌న్ గా ఉన్న డాక్ట‌ర్ వీకే పాల్ నేరుగా ప్ర‌ధాని మోదీకి నివేదిస్తారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున దేశంలో మ‌రోమారు లాక్‌డౌన్ పెట్టాల‌ని ఆయ‌న మోదీకి సూచించారు.

అయితే ఇటీవ‌ల సీఎంల‌తో నిర్వ‌హించిన స‌మావేశం అనంత‌రం దేశంలో లాక్ డౌన్ ఉండ‌ద‌ని మోదీ మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. ఆ నిర్ణ‌యాన్ని రాష్ట్రాల‌కే వ‌దిలేసిన‌ట్లు చెప్పారు. కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం, టీకాల‌ను తీసుకోవ‌డం ఒక్క‌టే మ‌న ముందున్న మార్గ‌మ‌ని, లాక్‌డౌన్ అనేది చివ‌రి స్టెప్ అని స్ప‌ష్టం చేశారు. కానీ దేశంలో ప‌రిస్థితి చూస్తే రోజు రోజుకీ దిగ‌జారిపోతోంది. ఈ క్ర‌మంలో టాస్క్ ఫోర్స్ సూచించిన మేర మోదీ లాక్‌డౌన్‌పై పున‌రాలోచ‌న చేస్తారా, లేదా, అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment