సారీ చెబితే చాల‌దు.. ప్ర‌ధాని మోదీపై ప్ర‌కాష్ రాజ్ విమ‌ర్శ‌లు..

November 21, 2021 5:55 PM

కేంద్ర ప్ర‌భుత్వం తాన అమ‌లులోకి తెచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ప్ర‌ధాని మోదీ తాజాగా ఈ ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌క్రియ ద్వారా ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తామ‌న్నారు. అయితే చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశాకే త‌మ ఆందోళ‌న‌ల‌ను నిలిపివేస్తామ‌ని రైతు సంఘాలు స్ప‌ష్టం చేశాయి.

prakash raj says sorry is not enough to pm modi

ఇక రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు ప్ర‌కాష్ రాజ్ మొద‌టి నుంచీ మ‌ద్ద‌తుగా నిలుస్తూ వ‌చ్చారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను కోట్ చేస్తూ.. ప్ర‌ధాని మోదీపై ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌రిపోద‌ని, మ‌ర‌ణించిన రైతుల కుటుంబాల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు.

కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళ‌న‌ల్లో చ‌నిపోయిన 750 మందికి పైగా రైతుల‌కు ఒక్కొక్క‌రికి రూ.3 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామ‌ని ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్ర‌కాష్ రాజ్ తాజాగా మోదీపై వ్యాఖ్య‌లు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment