Actress Chaurasia : న‌టి చౌరాసియాపై దాడి.. మిస్ట‌రీ వీడింది..!

November 20, 2021 1:02 PM

Actress Chaurasia : నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో వాకింగ్ చేస్తున్న న‌టి చౌరాసియాపై ఓ దుండ‌గుడు దాడి చేసి ఫోన్ ను దొంగిలించిన విష‌యం తెలిసిందే. ఈ కేసుని చాలా చాక‌చ‌క్యంగా ఛేదించారు పోలీసులు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

attack on Actress Chaurasia mystery solved police arrested the man

ఆదివారం రాత్రి వాకింగ్‌ చేస్తున్న షాలూ చౌరాసియాపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్‌ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండ పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. అయితే ఆమె అత‌ని ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసింది.

ఈ కేసుని చాలా సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు ఛేదించారు. నిందితుడు ఆదివారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ఇందిరానగర్‌ ప్రాంతంలో సెల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినట్లుగా గుర్తించిన నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ ఒక్క ఆధారంతో సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు.

కృష్ణానగర్, ఇందిరానగర్‌ మధ్యలో గది అద్దెకు తీసుకొని ఉంటున్న కె.బాబు సినీ పరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్నట్లుగా తెలిపారు. అత‌డు దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తానికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment