---Advertisement---

ఎన్‌టీవీ తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రిపై బుర‌ద చ‌ల్లేందుకే జూబ్లీ హిల్స్ స్కాం బ‌య‌ట‌కు

May 1, 2021 7:24 PM
---Advertisement---

ఒక వ్యక్తి ఎదుగుతుంటే తొక్కేయడం మన బడా బాబులకు అలవాటే. ఒకరు మంచి పని చేసినా, ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటున్నా ఎందుకో ఎక్కడలేని అసూయ‌, ఈర్ష్య ద్వేషాలు క‌లుగుతాయి. ఎన్‌టీవీ వ్య‌వ‌స్థాప‌కులు తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి మీడియా రంగంలో ఎనలేని సేవలందించిన విషయం మనకు తెలిసిందే. జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు. అలాంటి ఆయనపై బురదజ‌ల్లే ప్రయత్న చేస్తున్నారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసుల‌ను దౌర్జన్యంగా బనాయించి ఆయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ntv management released press note on jubille hills scam

ప్రధానంగా ఓ స్కాం లో ఆయన పేరు ఎక్కువగా వినబ‌డుతోంది. అదే జూబ్లీ హిల్స్ స్కాం. ఇప్పటివరకు క్లీన్ గా ఉన్న చౌదరి పేరు తెర మీదకు హఠాత్తుగా రావడానికి అనేక కారణాలున్నాయి. నిన్న మొన్నటి వరకు తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి అధ్యక్షతలో జూబ్లీ హిల్స్ కో ఆప‌రేటివ్ సొసైటీ ఉండేది. కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టీవీ5 ప్యానెల్ గెలుపొందింది. కాగా ఈ పోటీలో తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి పాల్గొనలేదు. ఆయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. అయితే అసలు సంగతి ఇక్కడే మొదలైంది. గత నెల చివరి వరకు ఈ స్కాం కు సంబంధించి ఎటువంటి మూలాలు లేవు కానీ హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక నరేంద్ర చౌదరి మీద కొంత మంది పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నంలో భాగంగా జరిగిన కుట్రకు పునాది అని తెలుస్తుంది.

జూబ్లీహిల్స్ కో ఆప‌రేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన టీవీ5 మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌వీంద్ర‌నాథ్ బొల్లినేని.. తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి.హ‌నుమంత‌రావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టారు. అది కూడా జూబ్లీహిల్స్ కో ఆప‌రేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీవీ5 మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌వీంద్ర‌నాథ్ బొల్లినేని ప్యానెల్ గెలిచిన తరువాత న‌రేంద్ర చౌద‌రి పైన గత ప్యానెల్ సెక్రెటరీ అయిన టి.హ‌నుమంత‌రావు పైన భూ కబ్జా కింద కేసు పెట్టారు. అంతకుముందు ఈ కేసు ఎక్కడికిపోయింద‌ని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఈ లావాదేవీని ఇప్పుడు స్కాం పేరుతో బయటకు తీసుకురావడం వెనుక అసలు కోణం ఆయనపై బురద చల్లడమే అని క్లియర్ గా తెలుస్తుంది.

గత అధ్యక్షుడయిన టి.న‌రేంద్ర చౌద‌రి వ్యక్తిగా, సామాజిక సంస్కర్తగా తన వ్యాపార దక్షతకు సమాజ సేవ దృక్పథం జోడించి అనేకానేక వ్యక్తి వికాస, సమాజ వికాస కార్యక్రమాల్లో తన వంతు అద్వితీయమైన కృషిని కొనసాగించారని ప్యానెల్ లోని సభ్యులు కొనియాడారు. మీడియా రంగంలో ఎన్‌టీవీ, ప్రప్రథమ తెలుగు భక్తి ప్రధాన ఛానల్ భక్తి టీవీ, మహిళా సాధికారత కోసం వనిత టీవీని స్థాపించి అనేక మందికి మార్గదర్శకులయ్యారు. ఆఖరికి ఛానళ్ల విషయంలోనూ ఆయనను కృంగదీసే ప్రయత్న చేస్తున్నారు. ఎంతో ఆధ్యాతికతను ప్రేక్షకులను పంచుతున్న భక్తి ఛానల్ ను రానివ్వకుండా, పాపులర్ కానివ్వకుండా కొంతమంది మీడియా బడా బాబులు చూస్తున్నారు. ఆ ఛానల్ గురించి చెడుగా కొన్ని వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నార‌ని వార్తలు వస్తున్నాయి.

కోటిదీపోత్సవం వంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు పునాది వేసిన ఓ సంఘసంస్కర్తని ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చూసినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు తప్ప‌ కృంగిపోరు అని ఆయన్ని అభిమానించే వారు అంటున్నారు. ఆయనను దిగజార్చడానికి ప్రముఖ మీడియా సంస్థలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయని ఇప్పటికే తెలుస్తుంది. వీటన్నిటికీ తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి సమాధానం ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now