Bigg Boss 5 : బిగ్ బాస్ నుండి ఆ వీడియోలు రిసీవ్ అయ్యాయంటూ.. కామెంట్స్ చేసిన నటి మాధవీలత..

November 19, 2021 12:24 PM

Bigg Boss 5 : టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ రన్ అవుతోంది. మొదటి సీజన్ నుండి ఇప్పటివరకు 5 సీజన్లు నడిచాయి. ఈ ప్రోగ్రామ్ పై ఫస్ట్ నుండి రూమర్స్, గాసిప్స్ తోపాటు వ్యతిరేకత కూడా భారీ స్థాయిలోనే ఏర్పడింది. ఈ రియాలిటీ షో అంతా స్క్రిప్ట్ బేస్డ్.. అంటూ ఎన్నో ఆరోపణలు కూడా వస్తూనే ఉంటున్నాయి. లేటెస్ట్ గా నటి మాధవీలత.. బిగ్ బాస్ హౌస్ అంటే.. ముద్దులు, హగ్గులు, రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది.. అంటూ ఆరోపించింది.

Bigg Boss 5  madhavi latha said those videos from house reached to her

ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇక హోస్ట్ నాగార్జునపై కూడా రీసెంట్ గా మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో మండిపడింది. లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ లో అడల్ట్ కంటెంట్ ఉందని, బిగ్ బాస్ అనేది లవర్స్ అడ్డాగా మారుతుందని ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్నారు.

షన్ను, సిరి, మానస్, ప్రియాంక.. ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ ని మెన్షన్ చేసింది. తన దృష్టిలో బావ, మరదలి రిలేషన్ అనేది బ్యూటీఫుల్ రిలేషన్ షిప్.. అని మాధవీలత అన్నారు.

 

చక్కగా గుడ్ నైట్ చెప్పేసి.. చల్లగా పడుకుందాం.. అనుకుంటే.. బిగ్ బాస్ లో రగులుతోంది మొగలిపొద.. సీన్స్ జరిగాయని.. గుస గుస అని మెసేజ్ లు పెడితే.. నేనెలా బజ్జోవాలి.. అయ్యో రామా ఎంత కష్టమొచ్చింది నాకు.. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. మనం ఇందులో పడ్డా అవుతాం చెడ్డా..

కృష్ణ కృష్ణ.. పగవాడికి కూడా ఇంత బాధ వద్దయ్యా.. అంటూ మాధవీలత కౌంటర్ ఇచ్చారు. ఇక తనకు బిగ్ బాస్ వీడియోలు రిసీవ్ అయ్యాయని, వాటిని పబ్లిష్ చేయడం కల్చర్ కాదని.. అన్నారు. ఈ మేరకు మాధవీ లత ఓ న్యూస్‌ చానల్‌ లైవ్‌ లో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment