Chethana Uttej : ఉత్తేజ్ కూతురు సీమంతం వేడుక‌.. హాజ‌రైన ప్ర‌ముఖులు..

November 19, 2021 12:43 PM

Chethana Uttej : సీనియ‌ర్ న‌టుడు ఉత్తేజ్ కూతురు చేత‌న ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి అనే సంగ‌తి తెలిసిందే. చేతన త్వరలోనే తల్లి కాబోతోంది. రీసెంట్‌గా ఆమె మెటర్నటీ షూట్‌ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టినా ఆనందమే అని పేర్కొంది. చేత‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి.

Chethana Uttej seemantham photos viral in social media

తాజాగా చేత‌న‌ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సింగర్లు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. మ‌రి కొద్ది రోజుల‌లో చేత‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. చిత్రం సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన చేతన పలు సినిమాల్లో నటించింది.

https://www.instagram.com/p/CWapS1rpEG9/

హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది చేత‌న‌. నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకోవడంతో ఉత్తేజ్‌ కొంతకాలం పాటు కూతురితో మాట్లాడలేదు. ఇప్ప‌టికీ కొంత దూరం మెయింటైన్ చేస్తున్నాడ‌ని టాక్.

ఇటీవ‌ల ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో మరణించారు. క్యాన్సర్ బారిన పడిన పద్మ చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. భార్య మరణం మానసికంగా ఉత్తేజ్ ని కృంగదీసింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు టాలీవుడ్ ప్రముఖులు పద్మ అంత్యక్రియలకు హాజరై ఉత్తేజ్ ని ఓదార్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment