Bigg Boss 5 : హ‌గ్గులు, ముద్దుల‌తో ర‌చ్చ చేస్తున్న సిరి – ష‌ణ్ముఖ్‌..!

November 19, 2021 9:24 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ ప్ర‌తి సీజ‌న్‌లో ఓ రొమాంటిక్ జంట త‌ప్ప‌క ఉంటుంది. వారు చేసే సంద‌డి కొన్ని సార్లు ప్రేక్ష‌కుల‌కి వినోదం క‌లిగించినా మ‌రి కొన్ని సార్లు విర‌క్తి తెప్పిస్తుంటుంది. తాజా సీజ‌న్‌లో ష‌ణ్ముఖ్, సిరిలు ఫ్రెండ్స్ అంటూనే హ‌గ్గులు, ముద్దుల‌తో నానా ర‌చ్చ చేస్తున్నారు. గురువారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో ర‌వికి సూప‌ర్ ప‌వ‌ర్‌ తీసుకునే ఛాన్స్ రాగా అత‌డు మాత్రం ఈ అవ‌కాశాన్ని స‌న్నీకి ఇస్తాన‌న్నాడు.

Bigg Boss 5 siri and shanmukh creating buzz in house

స‌న్నీ మాత్రం త‌న‌కు ఏ ప‌వ‌ర్ వ‌ద్ద‌ని మొండికేశాడు. బిగ్ బాస్ ఆదేశాల‌తో చివ‌ర‌కి ఆ ప‌వ‌ర్ ద‌క్కించుకున్నాడు. స‌న్నీ ఏదో ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్నాడ‌ని అర్థ‌మైన కాజ‌ల్ అత‌డి వెంటే న‌డిచింది. నా తోక‌లాగా వెన‌కే వ‌స్తున్నావేంటి ? అని చిరాకుప‌డ్డాడు స‌న్నీ. దీంతో హ‌ర్ట్ అయిన కాజ‌ల్‌ని సన్నీ ఓదార్చాడు. అనంత‌రం ర‌వి ఇచ్చిన ప‌వ‌ర్‌ని ఉప‌యోగించి స‌న్నీ గేమ్ ఆడాడు. ఈ గేమ్ ముగిసే స‌రికి మాన‌స్‌, ప్రియాంక‌, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండ‌ర్లుగా నిలిచారు.

ఇక ష‌ణ్ముఖ్‌.. దీప్తి సున‌య‌న‌ను గుర్తు చేసుకుంటుండ‌గా, సిరి.. శ్రీహాన్‌ని త‌ల‌చుకుంది. అయితే ఓ టాస్క్ జ‌రుగుతున్న స‌మ‌యంలో సిరి-ష‌ణ్ముఖ్ మధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో ఆమె ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేప‌ర్ మీద రాసిచ్చింది. ఫీలైన ష‌ణ్ను సారీ చెప్పి హ‌గ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అత‌డికి హ‌గ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇక పింకీని మాన‌స్ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో న‌న్ను కనీసం మనిషిలా అయినా చూడ‌మ‌ని వేడుకుంది. ఈ వారం ప్రెస్టీజ్ రూ.25 వేల గిఫ్ట్ వోచ‌ర్‌ యానీ సొంతమ‌వ‌గా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది.

చివ‌రిగా బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌తో కొన్ని క్ష‌ణాలు ఇంటికి అంకితం అనే స‌ర‌దా టాస్క్ ఆడించాడు. ఇందులో జంట‌లుగా విడిపోయిన హౌస్‌మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూత‌ద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. యానీ మాస్ట‌ర్‌- శ్రీరామ్ జోడీ ఎక్కువ పాయింట్స్ సాధించ‌డంతో చెరో రూ.5000ల గిఫ్ట్ వోచ‌ర్ ను గెలుపొందారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment