Nayanthara : గాడ్‌ ఫాదర్‌ సినిమాలో నయనతార ఫిక్స్.. అధికారిక ప్రకటన..!

November 18, 2021 10:09 PM

Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా గురించి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

Nayanthara as heroine in chiranjeevi godfather movie

ఇందులో హీరోయిన్ ఎవరు.. అనే విషయంపై గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠ ఏర్పడింది. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి సరసన నయనతార జత కట్టనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గురువారం నయనతార పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

మలయాళ లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్‌లో సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చింది.

ఈ సినిమాలో నయనతార.. చిరంజీవి భార్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరోసారి నయనతార.. చిరంజీవితో కలిసి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఇక ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now