Mega Heroes : నెల రోజుల వ్యవధిలో.. నలుగురు మెగా హీరోల సినిమాలు విడుదల..!

November 18, 2021 5:22 PM

Mega Heroes : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది మెగా హీరోలున్నారు. టాలీవుడ్ లో విడుదలయ్యే సినిమాల్లో దాదాపుగా మెగా హీరోలవే ఎక్కువగా ఉంటాయి. వీరంతా తమ సినిమాలను చాలా చక్కని ప్లానింగ్ తో షెడ్యూల్ చేసుకుంటారు. మెగా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇస్తూ.. మెగా అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తుంటారు. టాలీవుడ్ లో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో నలుగురు మెగా హీరోల సినిమాలు రిలీజవ్వడం గమనార్హం.

Mega Heroes movies releasing in one month

డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గనీ సినిమా కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతోంది. క్రిస్మస్ స్పెషల్ గా 24న రిలీజ్ అవుతోంది.

అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కొన్ని రోజుల తేడాతో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా భీమ్లా నాయక్ జనవరి 12న రిలీజ్ కు ఫిల్మ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాక 5 రోజుల తేడాతో భీమ్లా నాయక్ రిలీజ్ అవ్వడం అంటే మెగా అభిమానులకు పండగే.

ఏది ఏమైనా నెల రోజుల వ్యవధిలో మెగా హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఇక ఇదే నెల రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకష్ణ నటించిన అఖండ, నాని శ్యామ్ సింగ రాయ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్ సినిమాలు కూడా రిలీజ్ అవనున్నాయి. దీంతో సినీ ప్రేక్షకులకు డిసెంబర్‌, జనవరి నెలల్లో అద్భుతమైన వినోదాన్ని పంచనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now